Special Counter in Head Post Office from Dec 20

head post office

ఈనెల 20వ తేదీన రాజమండ్రిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామని డివిజనల్ సూపరింటెండెంట్ పి. కోమల్ కుమార్ శనివారం తెలిపారు. ఇందులో చారిత్రక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సంగీత, క్రీడలు, వన్యప్రాణులు, పక్షి జాతులకు సంబంధించిన విలువైన ఫిలాటలీ స్టాంపులను, ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన తపాలా కవర్లను విక్రయిస్తామన్నారు.

యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం: స్వామి స్మరణానంద గిరి

స్వామి స్మరణానంద గిరి

నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం పొందవచ్చని స్వామి స్మరణానంద గిరి పేర్కొన్నారు. శనివారం యోగదా సత్సంగ ఆత్మ సాక్షాత్కార పాఠాల ఆవిష్కరణ కార్యక్రమం ఆనం కళాకేంద్రంలో ప్రారంభించారు. క్రియాయోగ ధ్యానం కార్యక్రమంలో స్వామి స్మరణానంద గిరి ప్రసంగించారు. చిన్నతనం నుంచి యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. అమెరికాలోని ఎస్‌.ఆర్‌.ఎఫ్‌. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన శరత్‌ మాట్లాడుతూ కృష్ణ భగవానుడు బోధించిన క్రియాయోగం గురించి పరిచయం చేశారు. యోగదా సత్సంగ్‌ సొసైటీ ఆఫ్‌ … Read more

Devichowk: దసరా ఉత్సవాల్ల్లో సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు ఇవిగో

దసరా ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతీరోజు దేవిచౌక్ లో జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన కరపత్రం విడుదల అయింది. ప్రతీరోజు పౌరాణిక నాటకాలు, పాటల కార్యక్రమాలు, సంగీత విభావరి జరుగుతాయి. పౌరాణిక నాటకాల్లో బాల నాగమ్మ, శ్రీకృష్ణ తులాబాయం, కురుక్షేత్రం, పల్నాటి యుద్ధం, సత్య హరిశ్చంద్ర వంటి నాటకాలు ప్రదర్శించ బోతున్నారు. 

రంజాన్‌ అనేది వరాల వసంతం: ఇఫ్తార్‌ విందులో ఆదిరెడ్డి వాసు

రాజమండ్రి నగరంలోని స్థానిక జాంపేట వద్ద ఉన్న మసీదులో నిర్వహించిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ జరిగిన ముస్లింల సాంప్రదాయ ప్రార్ధనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రంజాన్‌ మాసం యొక్క విశిష్టత గురించి వివరించారు. రంజాన్‌ అనేది వరాల వసంతమని, చాలా గొప్ప నెల అని అభివర్ణించారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక … Read more

ఘనంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి సభ

 తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో శనివారం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి సభ నిర్వహిం చారు. తాడితోటలోని సంహిత కళాశాలలో జరిగిన కార్యక్రమానికి వైకాపా నాయకురాలు జక్కంపూడి విజ యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కథా రచయిత ప్రఖ్యాతి గాంచిన సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సాహిత్యంలో నవల, నాటక, కథ, కవిత, చరిత్ర, పురాణేతిహాసాలలో ప్రసిద్ధుడన్నారు. ఆయన జయంతిని తెలుగు కథా దినోత్సవంగా ప్రకటించాలన్నారు…. ఈసందర్భంగా రొబ్బి శశికళ రచించిన ‘సంవిధాన చక్రవర్తి … Read more