ఘనంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి సభ

 తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో శనివారం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి సభ నిర్వహిం చారు. తాడితోటలోని సంహిత కళాశాలలో జరిగిన కార్యక్రమానికి వైకాపా నాయకురాలు జక్కంపూడి విజ యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కథా రచయిత ప్రఖ్యాతి గాంచిన సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సాహిత్యంలో నవల, నాటక, కథ, కవిత, చరిత్ర, పురాణేతిహాసాలలో ప్రసిద్ధుడన్నారు. ఆయన జయంతిని తెలుగు కథా దినోత్సవంగా ప్రకటించాలన్నారు…. ఈసందర్భంగా రొబ్బి శశికళ రచించిన ‘సంవిధాన చక్రవర్తి రావి.ఎన్. – అవధాని కథానికలు, పరిశీలన పుస్తకాన్ని ఆవిష్కరిం చారు. ఎస్ కేవీటీ కళాశాల తెలుగు శాఖాధిపతి పి.వి. బి. సంజీవరావు మాట్లాడుతూ తెలుగు భాషపై పట్టు సాధించవచ్చన్నారు. మాజీ
కార్పొరేటర్ బొంతా శ్రీహరి, డాక్టర్ వి. కనకరాజు, జె. వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Rate this post