• Recent News

  • tej bharat

   తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ)గా ఎన్. తేజ్ భరత్ నియమితులయ్యారు. వెలగపూడిలోని సాధారణ పరిపాలన శాఖలో ముఖ్య కార్యదర్శి దగ్గర ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న ఈయనను జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇక్కడ జేసీగా పనిచేసిన సి. హెచ్. శ్రీధర్ మంగళగిరిలోని ప్రధాన భూపరిపాలన కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి (విజిలెన్స్)గా బదిలీపై వెళ్తున్నారు. AP FA2 Syllabus

  • MP bharat

   విశాఖ పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి వచ్చిన ప్రధాని మోదీని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఎన్ఎస్ డేగా వద్ద ప్రధానిని కలిశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ విమానాశ్రయంలో కలిసి స్వాగతం పలికారు. సీఎం జగన్ కు ఎంపీ భరత్ పుష్పగుచ్చం అందజేశారు. ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విశాఖ చేరుకున్నారు. అయితే అంతకు రెండు గంటల ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి విశాఖకు వచ్చారు. ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జగన్ కొద్ది సేపు విమానాశ్రయంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఎంపీ భరత్ సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తరువాత ప్రధాని మోదీ రాగానే సీఎం జగన్ తో పాటు ఎంపీ భరత్ కూడా ఎదురెళ్ళి మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని విశ్రాంతి తీసుకోనున్న ఐఎన్ఎస్ డేగా వద్ద మరోసారి సీఎం జగన్ తో పాటు ఎంపీ భరత్ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. అటు తర్వాత మన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ని కూడా ఎంపీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు.

  • Srikrishna yadava sangam

   రాజమహేంద్రవరంలోని స్థానిక లాలా చెరువు సమీపంలోని గోదావరి పుష్కర వనంలో ఈ నెల 13వ తేదీన రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్టు శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు నోడగల సుధ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వన సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరువుతారని తెలిపారు. ఈ సందర్భంగా పలు శ్రీ కృష్ణుడి వేషధారణ పోటీలు, సాంస్కృతి కార్యక్రమాలు, ఆట పాటలు తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేయనున్నట్టు వివరించారు. అలాగే 2022వ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్ధులకు నగదు బహుమతి అందచేసి సత్కరించనున్నట్టు తెలిపారు. యాదవ సంఫీుయులంతా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు 9348628787, 9848459904, 9393977111 నెంబర్లను సంప్రదించాలన్నారు.

  • goli ravi

   కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర సేవాదళ్ అదనపు చీఫ్ గోలి రవి(48) శనివారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్న రవి… బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్, రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. ఆయన మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూధర్, నగరాధ్యక్షుడు అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ సంతాపం వ్యక్తం చేశారు.

  • godavari-bride-closed

   Kovvuru Godavari Bridge Closed for Repairs for one Week: తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి మార్గం అయిన రాజమండ్రి-కొవ్వూరు  గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ని అత్యవసర మరమత్తులు కోసం అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి అత్యవసర రిపేర్ పనులను ఆర్‌అండ్‌బి, రైల్వే శాఖల ఆధ్వర్యలో పనులు నిర్వహించనున్నారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ , ఫుట్ పాత్ పూర్తిగా దెబ్బ తిన్నాయని.. వాటిని రిపేర్ చేయనున్నామని పేర్కొన్నారు. వాహనదారులు పోలీసు వారిచే సూచించిన మార్గాలలో కొవ్వూరు – రాజమండ్రి మధ్య ప్రయాణాలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగా ద్విచక్ర వాహనదారులు, నాలుగు చక్రాల వాహనాలు, ఆర్టీసి బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా ట్రాఫిక్ మళ్ళించడం జరుగుతోందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. లారీలు, భారీ వాహనాలు, ప్రవేటు బస్సులు, కమర్షియల్ వాహనాల యొక్క ట్రాఫిక్ ను కొవ్వూరు – రాజమండ్రి నాల్గవ వంతెన మీదుగా అనుమతించడం జరుగుతుందని పోలీసులు తెలియచేశారు. అయితే ఈనెల 17న అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ఈ బ్రిడ్జి ద్వారా కొనసాగవలసి ఉంది. దీని మూసివేత కారణంగా వారి యాత్రను కాటన్ బ్యారేజ్ మీదుగా లేదా 4వ బ్రిడ్గి మీదుగా మళ్లిస్తే యాత్ర ఆలస్యమాయే అవకాసం ఉంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర రాజమండ్రికి సమీపిస్తున్న సమయంలో బ్రిడ్జి మరమ్మతుల పేరుతో రాకపోకలు నిలిపివేయడం రాజకేయ నిర్ణయం ఏమో అన్న అనుమానం విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

  • jakkampudi

   దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జీవిత చరిత్ర నేటి యువ రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శనీయమని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమండ్రి కంబాల చెరువు సెంటర్ నందు రాజమండ్రి నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన జక్కంపూడి రామ్మోహన రావు వర్ధంతి వేడుకలలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన రావు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రతి అడుగులోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందులోను ఎందరో నాయకులు వెన్నంటి నిలవడం జరిగిందన్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన రావు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి తన కష్టాన్ని, ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి రాష్ట్ర క్యాబినెట్ స్థాయికి ఎదగడం జరిగింది అన్నారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన రావు తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వాటిని అధిగమించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంత ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడికైనా రాజకీయ జీవితంలో అంతా మంచే జరుగుతుంది అనడానికి జక్కంపూడి రామ్మోహన రావు జీవిత చరిత్ర ఒక చక్కటి ఉదాహరణ అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్య ప్రకాష్ రావు, నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, మజ్జి అప్పారావు, మానే దొరబాబు, కోడి కోట, లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.