AKC కాలేజ్ అర్ధ శతాబ్ది ఉత్సవాలకు వెంకయ్య నాయుడు 22న రాక

venkayya naidu

రాజమండ్రి జే. ఎన్ రోడ్డులోని ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కళాశాల అర్ధ శతాబ్ది ఉత్సవం ఈనెల 22న జరుగుతుందని కళాశాల పాలకవర్గం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరవుతారన్నారు. కళాశాల అభివృద్ధికి కృషిచేసిన విశ్రాంత అధ్యాపకులు, పూర్వపాలకవర్గ సభ్యులకు సత్కారం, అవధాన కార్యక్రమం ఉంటుందన్నారు.

యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం: స్వామి స్మరణానంద గిరి

స్వామి స్మరణానంద గిరి

నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం పొందవచ్చని స్వామి స్మరణానంద గిరి పేర్కొన్నారు. శనివారం యోగదా సత్సంగ ఆత్మ సాక్షాత్కార పాఠాల ఆవిష్కరణ కార్యక్రమం ఆనం కళాకేంద్రంలో ప్రారంభించారు. క్రియాయోగ ధ్యానం కార్యక్రమంలో స్వామి స్మరణానంద గిరి ప్రసంగించారు. చిన్నతనం నుంచి యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. అమెరికాలోని ఎస్‌.ఆర్‌.ఎఫ్‌. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన శరత్‌ మాట్లాడుతూ కృష్ణ భగవానుడు బోధించిన క్రియాయోగం గురించి పరిచయం చేశారు. యోగదా సత్సంగ్‌ సొసైటీ ఆఫ్‌ … Read more

13న రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన

Srikrishna yadava sangam

రాజమహేంద్రవరంలోని స్థానిక లాలా చెరువు సమీపంలోని గోదావరి పుష్కర వనంలో ఈ నెల 13వ తేదీన రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్టు శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు నోడగల సుధ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వన సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరువుతారని తెలిపారు. ఈ సందర్భంగా పలు శ్రీ కృష్ణుడి వేషధారణ పోటీలు, సాంస్కృతి కార్యక్రమాలు, ఆట … Read more

Maruti Suzuki Grand Vitara Launched in Rajahmundry: అత్యధిక మైలేజ్ దీని సొంతం

grand vitara

రాజమహేంద్రవరం: మారుతీ సుజుకీ సెక్స్ ఛానల్ నుంచి నూతనంగా రూపొందించిన గ్రాండ్ విటారా SUV వాహనాన్ని నగర మార్కెట్ లోకి ఎంపి భరత్ రాం బిడుదల చేసారు.  కార్యక్రమంలో నెక్స ఎస్బీ మోటార్స్ ఎండి ఎం. రామకుమార్ మాట్లాడుతూ దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఎస్ యూవీ మోడల్ కార్డుగా గ్రాండ్ విటారా నిలుస్తుందన్నారు. పెట్రోల్, బ్యాటరీల ద్వారా ఇంటి లిజెంట్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుందన్నారు. ఆరు ఎయిర్ బ్యాగులు, … Read more

నేడు సుబ్రహ్మణ్య మైదానంలో “దసరా మహిళా సాధికారత ఉత్సవం”

దసరా మహిళా సాధికారత ఉత్సవం

రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం నిర్వహిస్తున్న దసరా మహిళా సాధికారత ఉత్సవాన్ని జయప్రదం చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ ఆనం కళాకేం ద్రంలో ఈ ఉత్సవం ఏర్పాట్లపై కమిషన్ సభ్యురాలు జయశ్రీతో కలసి ఆమె విలేకరులతో సమావేశంలో పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ స్వాతంత్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల అభివృద్ధి, సాధికారత గురించి ఎవరెన్ని మాట్లాడినా. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషే … Read more

Today Events in City: రాజమండ్రి నగరంలో నేటి కార్యక్రమాలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా  ఉదయం 10 గంటలకు గోకవరం బస్టాండ్లోని జిత్ మోహన్ మిత్రా నివాసంలో సంగీత విభావరి సాయంత్రం 4 గంటలకు డాక్టర్ కంటే వీరన్న చౌదరి నిర్వహణలో ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరంలో బాలు సంస్కరణ కార్యక్రమం. సాయంత్రం 4 గంటల నుంచి శ్రీహరి ఈవెంట్స్ నిర్వహణలో బాలు ద్వితీయ వర్ధంతి సందర్భంగా విక్రమహాలులో సంగీత విభావరి సాయంత్రం 6.30 గంటల నుంచి సంగీతలహరి సాంస్కృతిక సేవా సమితి నిర్వహణలో కర్ణాటక గాత్ర సంగీత కచేరీ