AKC కాలేజ్ అర్ధ శతాబ్ది ఉత్సవాలకు వెంకయ్య నాయుడు 22న రాక

venkayya naidu

రాజమండ్రి జే. ఎన్ రోడ్డులోని ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కళాశాల అర్ధ శతాబ్ది ఉత్సవం ఈనెల 22న జరుగుతుందని కళాశాల పాలకవర్గం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరవుతారన్నారు. కళాశాల అభివృద్ధికి కృషిచేసిన విశ్రాంత అధ్యాపకులు, పూర్వపాలకవర్గ సభ్యులకు సత్కారం, అవధాన కార్యక్రమం ఉంటుందన్నారు.

13న రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన

Srikrishna yadava sangam

రాజమహేంద్రవరంలోని స్థానిక లాలా చెరువు సమీపంలోని గోదావరి పుష్కర వనంలో ఈ నెల 13వ తేదీన రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్టు శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు నోడగల సుధ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వన సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరువుతారని తెలిపారు. ఈ సందర్భంగా పలు శ్రీ కృష్ణుడి వేషధారణ పోటీలు, సాంస్కృతి కార్యక్రమాలు, ఆట … Read more

నేడు సుబ్రహ్మణ్య మైదానంలో “దసరా మహిళా సాధికారత ఉత్సవం”

దసరా మహిళా సాధికారత ఉత్సవం

రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం నిర్వహిస్తున్న దసరా మహిళా సాధికారత ఉత్సవాన్ని జయప్రదం చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ ఆనం కళాకేం ద్రంలో ఈ ఉత్సవం ఏర్పాట్లపై కమిషన్ సభ్యురాలు జయశ్రీతో కలసి ఆమె విలేకరులతో సమావేశంలో పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ స్వాతంత్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల అభివృద్ధి, సాధికారత గురించి ఎవరెన్ని మాట్లాడినా. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషే … Read more

Today Events in City: రాజమండ్రి నగరంలో నేటి కార్యక్రమాలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా  ఉదయం 10 గంటలకు గోకవరం బస్టాండ్లోని జిత్ మోహన్ మిత్రా నివాసంలో సంగీత విభావరి సాయంత్రం 4 గంటలకు డాక్టర్ కంటే వీరన్న చౌదరి నిర్వహణలో ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరంలో బాలు సంస్కరణ కార్యక్రమం. సాయంత్రం 4 గంటల నుంచి శ్రీహరి ఈవెంట్స్ నిర్వహణలో బాలు ద్వితీయ వర్ధంతి సందర్భంగా విక్రమహాలులో సంగీత విభావరి సాయంత్రం 6.30 గంటల నుంచి సంగీతలహరి సాంస్కృతిక సేవా సమితి నిర్వహణలో కర్ణాటక గాత్ర సంగీత కచేరీ

AU Distance Classes: 13 నుంచి ఏయూ దూరవిద్య కోర్సుల తరగతులు

ఈనెల 13వ తేదీ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ఏయూ దూర విద్య ద్వారా డిగ్రీ విద్యార్థులకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరుగుతాయన్నారు. దూర విద్య ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులు గమనించాలని అధ్యయన కేంద్రం నిర్వహకులు ప్రకాష్ తెలిపారు.