రంజాన్‌ అనేది వరాల వసంతం: ఇఫ్తార్‌ విందులో ఆదిరెడ్డి వాసు

రాజమండ్రి నగరంలోని స్థానిక జాంపేట వద్ద ఉన్న మసీదులో నిర్వహించిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ జరిగిన ముస్లింల సాంప్రదాయ ప్రార్ధనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రంజాన్‌ మాసం యొక్క విశిష్టత గురించి వివరించారు. రంజాన్‌ అనేది వరాల వసంతమని, చాలా గొప్ప నెల అని అభివర్ణించారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందని, అల్లాహ్ మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోందన్నారు.

Rate this post