జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణలేకుండా పోయింది: మాలే విజయలక్ష్మి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ మహిళ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి విమర్శించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మానసిక వికలాంగురాలు పై 30గంటల పాటు ముగ్గురు వ్యక్తులు ఆత్యాచారం జరిగితే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మరో పక్క మహిళ కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ తమ విధులను నిర్వర్తించకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడుపై దాడి చేయడానికి, చంద్రబాబు నాయుడిని అప్రదిష్ట పలు చేయడానికి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పాలనలో మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ లేని దిశ చట్టం ఎందుకు అని ప్రశ్నించారు.

Rate this post