Bhima Gold Showroom: రాజమండ్రిలో భీమ ఆభరణాల షోరూం ప్రారంభం

bhima gold showroom rjy

నగరంలోని గోకవరం బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు, వజ్రాభరణాల షోరూంను హోం మంత్రి తానేటి వనిత శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ భరత్ రాం, రుడా చైర్మన్ షర్మిలా రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ ఎండీ విష్ణు చరణ్ భట్ వీరికి సాదర స్వాగతం పలికారు. అనతరం బంగారు, వెండి, ప్లాటినం విభాగాలను వారు తిలకించారు. మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఆభరణాలు అందుబాటులో ఉనడం అభినందనీయం అని అన్నారు. ఎండీ … Read more

6th Day in Devi Chowk: లలితా దేవిగా అమ్మవారు

lalitha-devi

దేవిచౌక్ లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు లలితాదేవి అలంకారంలో దర్సనం ఇచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం దేవిచౌక్ వద్ద కూచిపూడి నృత్య ప్రదర్సన మరియు రాత్రి 10 గంటలకు రోషన్ లాల్ ఆర్కెస్ట్రా కార్యక్రమాలు జరుగుతాయి అని నిర్వాహకులు చెప్పారు.

EG Dist Collector: అభివృద్ధి పథంలో తూర్పు గోదావరి

egdist collector

‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జిల్లాలోని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ౩33 పనులకు పరిపాలనా అనుమతి  లభించగా వీటిలో ఇప్పటివరకు 202 పనులను ప్రారంభించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. మంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పనులను సమీక్షించారు. దీనిలో  కలెక్టర్ తో పాటు  జేసి శ్రీధర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చూలిక … Read more

Devichowk: దసరా ఉత్సవాల్ల్లో సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు ఇవిగో

దసరా ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతీరోజు దేవిచౌక్ లో జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన కరపత్రం విడుదల అయింది. ప్రతీరోజు పౌరాణిక నాటకాలు, పాటల కార్యక్రమాలు, సంగీత విభావరి జరుగుతాయి. పౌరాణిక నాటకాల్లో బాల నాగమ్మ, శ్రీకృష్ణ తులాబాయం, కురుక్షేత్రం, పల్నాటి యుద్ధం, సత్య హరిశ్చంద్ర వంటి నాటకాలు ప్రదర్శించ బోతున్నారు. 

Devichowk: గాయత్రి మాత అవతారంలో రెండోరోజు

దసరా ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు గాయత్రి మాత అలంకారం లో భక్తిలకు దర్సనం ఇచ్చారు. దేవిచౌక్ లో 89వ దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అనేక మంది భక్తులు, రాజకీయ నాయకులు అమ్మవారిని రోజంతా దర్సిన్చుకున్తున్నారు. సాంస్కృతిక ఉత్సవాలు కూడా ప్రతీరోజు జరుగుతున్నాయి. 

ఘనంగా చిలకమర్తి లక్ష్మీనరసింహం 155వ జయంతి వేడుక

జాతీయ కవి, స్వాతంత్ర్య సమరయో ధుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం 155వ జయంతి వేడుక సోమవారం స్వాతంత్ర్య సమరయోధుల పార్కులోని ఆయన విగ్రహం వద్ద నిర్వహిం చారు. చిలకమర్తి కుడు ఫౌండేషన్ నిర్వాహకుడు  పెరుమాళ్ల రఘునాథ్ ఆధ్వ ర్యంలో జరిగిన కార్య క్రమంలో డాక్టర్ అరి నారాయణ రావు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో దురాచారాలపై పోరాటం సాగించిన చిలకమర్తి సమాజ సేవ, సాహితీసేవ రెండింటిలో తనదైన పాత్ర పోషించారన్నారు.  ఎస్ కేవీటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎబెల్ రాజబాబు … Read more