Kovvuru Bridge Repairs: రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేత వారం పాటు

Kovvuru Godavari Bridge Closed for Repairs for one Week: తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి మార్గం అయిన రాజమండ్రి-కొవ్వూరు  గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ని అత్యవసర మరమత్తులు కోసం అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి అత్యవసర రిపేర్ పనులను ఆర్‌అండ్‌బి, రైల్వే శాఖల ఆధ్వర్యలో పనులు నిర్వహించనున్నారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ , ఫుట్ పాత్ పూర్తిగా దెబ్బ తిన్నాయని.. వాటిని రిపేర్ చేయనున్నామని పేర్కొన్నారు.

వాహనదారులు పోలీసు వారిచే సూచించిన మార్గాలలో కొవ్వూరు – రాజమండ్రి మధ్య ప్రయాణాలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగా ద్విచక్ర వాహనదారులు, నాలుగు చక్రాల వాహనాలు, ఆర్టీసి బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా ట్రాఫిక్ మళ్ళించడం జరుగుతోందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. లారీలు, భారీ వాహనాలు, ప్రవేటు బస్సులు, కమర్షియల్ వాహనాల యొక్క ట్రాఫిక్ ను కొవ్వూరు – రాజమండ్రి నాల్గవ వంతెన మీదుగా అనుమతించడం జరుగుతుందని పోలీసులు తెలియచేశారు.

అయితే ఈనెల 17న అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ఈ బ్రిడ్జి ద్వారా కొనసాగవలసి ఉంది. దీని మూసివేత కారణంగా వారి యాత్రను కాటన్ బ్యారేజ్ మీదుగా లేదా 4వ బ్రిడ్గి మీదుగా మళ్లిస్తే యాత్ర ఆలస్యమాయే అవకాసం ఉంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర రాజమండ్రికి సమీపిస్తున్న సమయంలో బ్రిడ్జి మరమ్మతుల పేరుతో రాకపోకలు నిలిపివేయడం రాజకేయ నిర్ణయం ఏమో అన్న అనుమానం విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

Rate this post