జాతీయ రహదారిపై మోరంపూడి కూడలి వద్ద పైవంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల పాటు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నామవరం నుంచి రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండు వైపు వెళ్లే వాహనాలు మోరంపూడి సాయినగర్ దుర్గమ్మగుడి పక్క నుంచి గాదాలమ్మ రోడ్డు మీదుగా అప్సరలాడ్జి నుంచి జాతీయ రహదా రిపైకి రావాలన్నారు. సాయినగర్ దుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న రోడ్డునుంచి గంగి రెడ్ల కాలనీ మీదుగా హుకుంపేట కూడలికి చేరుకోవాలన్నారు. అటుగా వచ్చే భారీ వాహనాలు సాయినగర్ హెచ్పీ పెట్రోల్బంకు ఎదురుగా ఉన్న మార్గం నుంచి గాదాలమ్మనగర్ మీదుగా జాతీయ రహదారికి వైపుగా వెళ్లా లన్నారు.
ఆర్టీసీ బస్టాండు నుంచి నామవరం వెళ్లే వాహనాలు వీఎలప్పురం వినాయకుడి గుడి నుంచి రైతుబజార్ మీదుగా మోడలా కాలనీ, కవల గొయ్యి కడలి జాతీయ రహదారిపై నుంచి నిమ్మకాయల మార్కెట్ రోడ్డు, గాదాల మ్మగుడి మీదుగా నామవరం వైపు వెళ్లాలన్నారు.
జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే మార్గాల్లో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. ఆయా మార్గాల్లో రోడ్డు మధ్యలో నుంచి వెళ్లడం, డివైడర్ల దాటి వెళ్లడం వంటివి చేయకుండా ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని డీఎస్సీ కోరారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.