Morampudi Flyover : మోరంపూడి ఫ్లై ఓవర్ పనులతో ట్రాఫిక్ మళ్లింపు

morampudi flyover works

జాతీయ రహదారిపై మోరంపూడి కూడలి వద్ద పైవంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల పాటు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నామవరం నుంచి రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండు వైపు వెళ్లే వాహనాలు మోరంపూడి సాయినగర్ దుర్గమ్మగుడి పక్క నుంచి గాదాలమ్మ రోడ్డు మీదుగా అప్సరలాడ్జి నుంచి జాతీయ రహదా రిపైకి రావాలన్నారు. సాయినగర్ దుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న రోడ్డునుంచి గంగి రెడ్ల కాలనీ … Read more

ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యలు: రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ

తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.. డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా చెక్ చేసి 80 డేసిబుల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై మోటార్ వాహన చట్టం U/S 190 (2) ప్రకారం జరిమానా విధిస్తున్నారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న 20 బుల్లెట్ … Read more

Tourist Police Station inaugurated at Pushkar Ghat

tourist police station rjy

A special police station has been set up at Pushkar Ghat in Rajamahendravaram as part of tourist police stations established in 20 tourist areas across the State. Pushkar Ghat is a must-visit place for tourists coming to Rajahmundry City. About 3,000 people visit on normal days and about 5,000 people come for Godavari baths and … Read more

Drunk and Drive: రాజమండ్రిలో మద్యం తాగి వాహనాలు నడిపే 16 మందిపై కేసులు

రాజమండ్రిలో ఈ నెల 13, 14 తేదీల్లో పోలీస్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే 16 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా బుధవారం వారిని రాజమండ్రి ఒకటో ప్రత్యేక జేబీఎస్ కోర్టులో హాజరు పర్చగా 13 కేసుల్లో నిందితులకు రూ. 14 వేలు అపరాధ రుసుం విధించారు. అలాగే మూడు కేసుల్లో ముగ్గురికి మూడురోజుల సాధారణ జైలు, రూ. 500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

CPI Leaders Arrest: రాజమండ్రిలో సిపిఐ నాయకులు ముందస్తు అరెస్టులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మారాయని దీనిపై ప్రజల బాధ తీర్చాలని 9న చలో అమరావతి నిర్వహిస్తుంటే జిల్లాలో ముందుస్తు అరెస్టులు చేయడం దారుణమని సిపిఐ నేత తాటిపాక మధు అన్నారు. ఈ నెల 9న సిపిఐ చలో అమరావతికి పిలుపునిస్తే ఒకరోజు ముందు నుండే పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సిపిఐ, ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయడం … Read more

Police Alert: డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అభద్రత, సమస్యాత్మక, నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ‘డ్రోన్ కెమెరా’ను ఉపయోగించి శాంతి భద్రతల పరిరక్షణకు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.