ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యలు: రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ

తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.. డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా చెక్ చేసి 80 డేసిబుల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై మోటార్ వాహన చట్టం U/S 190 (2) ప్రకారం జరిమానా విధిస్తున్నారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లను గుర్తించి వాటి సైలెన్సర్లను వాహనదారుల ద్వారా తీయించి నట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.. ఇక పై ప్రతిరోజు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని.. అధిక శబ్దం చేసే సైలెన్సర్స్ ను బుల్లెట్ మోటార్ సైకిల్ కు అమర్చరాదని వార్నింగ్‌ ఇచ్చారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లను బిగించే మోటార్ సైకిల్ మెకానిక్ షాపుల వారిపై కూడా చర్యలు తీసుకుంటామని.. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘించిన వారిపై కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు.

Rate this post