Jakkampudi Death Anniversary: “జక్కంపూడి జీవిత చరిత్ర ఆదర్శనీయం”

దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జీవిత చరిత్ర నేటి యువ రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శనీయమని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.

రాజమండ్రి కంబాల చెరువు సెంటర్ నందు రాజమండ్రి నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన జక్కంపూడి రామ్మోహన రావు వర్ధంతి వేడుకలలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన రావు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రతి అడుగులోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందులోను ఎందరో నాయకులు వెన్నంటి నిలవడం జరిగిందన్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన రావు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి తన కష్టాన్ని, ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి రాష్ట్ర క్యాబినెట్ స్థాయికి ఎదగడం జరిగింది అన్నారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన రావు తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వాటిని అధిగమించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంత ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడికైనా రాజకీయ జీవితంలో అంతా మంచే జరుగుతుంది అనడానికి జక్కంపూడి రామ్మోహన రావు జీవిత చరిత్ర ఒక చక్కటి ఉదాహరణ అని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్య ప్రకాష్ రావు, నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, మజ్జి అప్పారావు, మానే దొరబాబు, కోడి కోట, లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Rate this post