“సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర” విజయవంతం

రాజమహేంద్రవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కార్యక్రమంలో మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులు డా. బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కోమరం భీం వంటి ఎందరో మహానుబావులు బీసీల అభివృద్ధికి పోరాడారని అదే మార్గంలో ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనకబడిన తరగతుల అభివృద్ధి విశేషంగా కృషి చేస్తున్నారని సామాజిక న్యాయ బేరి బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన … Read more

Rajini as Additional SP: అడిషనల్ ఎస్పీ‌గా బాధ్యతలు చేపట్టిన రజిని

తూ. గోదావరి జిల్లాకు నూతన ఎడిషనల్ ఎస్పీగా ఎం. రజనీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ. కొత్తగా ఏర్పాటు చేసిన తూ. గో జిల్లా పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళల, చిన్నారులు భద్రతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలపై దృష్తి సారించి వాటిని అరికట్టేలా చూస్తామని సార నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేశారు.

Sharmila Reddy met YS Jagan

మన జిల్లాలోని ఐ. పోలవరం మండలం మురమల్ల వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమండ్రి నగర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆమె ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించారు. అదే సమయంలో ఆమె నగరంలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.

Police Alert: డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అభద్రత, సమస్యాత్మక, నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ‘డ్రోన్ కెమెరా’ను ఉపయోగించి శాంతి భద్రతల పరిరక్షణకు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Police Welfare Day: ‘పోలీసు వెల్ఫేర్ డే’ నిర్వహించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు సిబ్బంది సమస్యలను సమగ్రంగా పరిష్కరించే నిమిత్తం ‘పోలీస్ వెల్ఫేర్ డే’ ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన సిబ్బంది అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Tollfree Helpline for Old Age People 14567

East Godavari District Collector Dr. Madhaveelatham announced that a helpline number 14567 has been set up with the facility to make free phone calls for solutions and services information on the problems of the elderly. The detailed poster was unveiled at the Collectorate on Wednesday evening. 14567 Details of nursing homes in services in the … Read more