మన జిల్లాలోని ఐ. పోలవరం మండలం మురమల్ల వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమండ్రి నగర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆమె ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించారు. అదే సమయంలో ఆమె నగరంలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.