NVS Recruitment 2024: నవోదయ స్కూల్స్ లో 1377 ఉద్యోగాలు, అర్హతలు ఇవీ!

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్ , నవోదయ విద్యాలయ సమితికి చెందిన ప్రాంతీయ కార్యాలయాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1377 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇవి తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 1377

పోస్టుల వివరాలు:

  1. ఫిమేల్ స్టాఫ్ నర్స్ – 121 పోస్టులు
  2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 5 పోస్టులు
  3. ఆడిట్ అసిస్టెంట్ – 12 పోస్టులు
  4. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ – 4 పోస్టులు
  5. లీగల్ అసిస్టెంట్ – 1 పోస్టు
  6. స్టెనోగ్రాఫర్ – 23 పోస్టులు
  7. కంప్యూటర్ ఆపరేటర్ – 2 పోస్టులు
  8. క్యాటరింగ్ సూపర్వైజర్ – 78 పోస్టులు
  9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 381 పోస్టులు
  10. ఎలక్ట్రిషన్ కం ప్లంబర్ – 128 పోస్టులు
  11. ల్యాబ్ అటెండెంట్ – 161 పోస్టులు
  12. మెస్ హెల్పర్ – 442 పోస్టులు
  13. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 19 పోస్టులు

విభాగాలు : నవోదయ విద్యాలయ సమితి కార్యాలయాలు, స్కూళ్ళు

అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ, PG, B.sc (నర్సింగ్) మరియు పోస్టులను అనుసరించి అనుభవం ఉండాలి.

వయసు: 35 సంవత్సరాలు వరకు (పోస్టులను అనుసరించి)

అప్లికేషన్ ఫీజు :

  1. ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్ , EWS, OBC అభ్యర్థులకు ఫీజు 1500/- రూపాయలు.

SC / ST / PWD అభ్యర్థులకు – 1000/-

  1. మిగతా ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్ , EWS, OBC అభ్యర్థులకు ఫీజు 1000/- రూపాయలు.

SC / ST / PWD అభ్యర్థులకు – 500/-

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో మాత్రమే ధరఖాస్తు చేయాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఇంకా ప్రకటించలేదు

వెబ్‌సైట్‌:  navodaya.gov.in

నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

Rate this post