యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం: స్వామి స్మరణానంద గిరి

నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంత జీవనం పొందవచ్చని స్వామి స్మరణానంద గిరి పేర్కొన్నారు. శనివారం యోగదా సత్సంగ ఆత్మ సాక్షాత్కార పాఠాల ఆవిష్కరణ కార్యక్రమం ఆనం కళాకేంద్రంలో ప్రారంభించారు. క్రియాయోగ ధ్యానం కార్యక్రమంలో స్వామి స్మరణానంద గిరి ప్రసంగించారు. చిన్నతనం నుంచి యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. అమెరికాలోని ఎస్‌.ఆర్‌.ఎఫ్‌. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన శరత్‌ మాట్లాడుతూ కృష్ణ భగవానుడు బోధించిన క్రియాయోగం గురించి పరిచయం చేశారు. యోగదా సత్సంగ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా రాజమహేంద్రవరం ఛైర్మన్‌ రామ్‌కుమార్, బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.

Rate this post