రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం నిర్వహిస్తున్న దసరా మహిళా సాధికారత ఉత్సవాన్ని జయప్రదం చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ ఆనం కళాకేం ద్రంలో ఈ ఉత్సవం ఏర్పాట్లపై కమిషన్ సభ్యురాలు జయశ్రీతో కలసి ఆమె విలేకరులతో సమావేశంలో పాల్గొన్నారు.
వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ స్వాతంత్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల అభివృద్ధి, సాధికారత గురించి ఎవరెన్ని మాట్లాడినా. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషే ముద్ర వేసు కుందన్నారు. మహిళల కోసం చేస్తున్న అభివృద్ధి విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంతో పోల్చుకున్నా జగమ్మో హన్‌రెడ్డి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. సమాజంలో 50 శాతం మహిళలు ఉన్నప్పుడు వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అన్నింటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్మానించారన్నారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ సమాజంలో సమాన హక్కులు కల్పించారన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా అమ్మబడి, చేయూత వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆమె అన్నారు.
30 లక్షల ఇళ్ళ పట్టాలను ఆస్తి హక్కుగా మహిళలకే కల్పిస్తూ స్థలాన్ని, ఇంటి పట్టాలను అందించిందన్నారు. దసరా సందర్భంగా మహిళా సాధికారత తీరును ప్రదర్శించేలా రాజమ హేంద్రవరంలో వేడుక నిర్వహించాలని సంకల్పించా మన్నారు.
శనివారం జరిగే ఈ కార్యక్రమాలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం పీలు, ఇతర నాయకులు పాల్గొంటారని వివరించారు.