రాష్ట్ర స్థాయి షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో రాజమండ్రి “రాధిక”కు మూడో స్థానం

దసరా మహిళా సాధికార ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సబల రాష్ట్ర స్థాయి షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో కాకినాడ జె ఎంటర్‌టైన్మెంట్‌ వారి ‘ఆమె’ షార్ట్‌ ఫిల్మ్‌ విజేతగా నిలిచింది. గుంటూరు జిల్లా గోరంట్ల నుంచి షారోన్‌ ఫిలింస్‌ తీసిన సబల షార్ట్‌ ఫిల్మ్‌ రెండో స్థానంలో  నిలిచింది. రాజమహేంద్రవరం కు చెందిన మైరా క్రియేటివ్స్‌ వారి రాధిక షార్ట్‌ ఫిల్మ్‌ కు మూడో స్థానం వచ్చింది . ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50వేలు, తృతీయ బహుమతిగా రూ.25వేలును అందిస్తారు. అలాగే రూ.20 వేలు నగదు బహుతులకు గాను లఘుచిత్రాల నుంచి రాజమహేంద్రవరం యూనివర్శల్‌ క్రియేషన్స్‌ ‘నాకు మీరు మీకు నేను’, డ్రీమ్‌ మేకర్స్‌ వారి ‘స్వేచ్ఛ’, వంశీ మీడియా చిలకలూరి పేట వారి భవిత, సత్తి రత్నకుమారి ఫిలింస్‌ వారి ‘మహిళలు మీకు వందనాలు’, ఎంకే ప్రొడక్షన్స్‌ వారి ‘సర్వం సబల శక్తి మయం’ లఘుచిత్రాలు ఎంపిక చేశారు.

అలాగే ఉత్తమ నటిగా సబల నుంచి బండారు నాగరాణి, ఉత్తమ నటుడిగా ‘ఆమె’ నుంచి సూర్య ఆకొండి, ఉత్తమ రచనకు గాను నరరాక్షస ఫిల్మ్‌ నుంచి మల్లికార్జున, ఉత్తమ దర్శకత్వానికి గాను దిశ (ది పవర్‌ ఆఫ్‌ ఉమెన్‌) ఫిల్మ్‌ నుంచి బాలలు ఎంపికయ్యారు. వీరందరికి శనివారం మహిళా కమిషన్‌ నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందించనున్నట్టు కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Rate this post