MP Bharath: విశాఖలో జగన్, మోడీ లకు స్వాగతం పలికిన ఎంపీ భరత్ రామ్

MP bharat

విశాఖ పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి వచ్చిన ప్రధాని మోదీని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఎన్ఎస్ డేగా వద్ద ప్రధానిని కలిశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ విమానాశ్రయంలో కలిసి స్వాగతం పలికారు. సీఎం జగన్ కు ఎంపీ భరత్ పుష్పగుచ్చం అందజేశారు. ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విశాఖ చేరుకున్నారు. అయితే అంతకు రెండు గంటల ముందే … Read more

ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలి: బుడ్డిగ రాధాకృష్ణ

ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలని రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బుడ్డిగ రాధాకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఇకపై ఫ్లెక్స్ లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 35 ఫ్లెక్స్ మిషన్స్ ఉన్నాయని, ఒక్కొక్క దాంట్లో ఐదుగురు చొప్పున పనిచేస్తున్నారని, వారిపై కుటుంబాలు ఆధారపడ్డాయని హఠాత్తుగా ఫ్లెక్స్ లు … Read more

‘Undavalli Demand: పోలవరం’పై శ్వేత పత్రం విడుదల చేయాలి: ఉండవల్లి

పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. బుధవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరంపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని అసలు విషయం ఏమిటో తేల్చడం లేదన్నారు.

“సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర” విజయవంతం

రాజమహేంద్రవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కార్యక్రమంలో మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులు డా. బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కోమరం భీం వంటి ఎందరో మహానుబావులు బీసీల అభివృద్ధికి పోరాడారని అదే మార్గంలో ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనకబడిన తరగతుల అభివృద్ధి విశేషంగా కృషి చేస్తున్నారని సామాజిక న్యాయ బేరి బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన … Read more

CPI Leaders Arrest: రాజమండ్రిలో సిపిఐ నాయకులు ముందస్తు అరెస్టులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మారాయని దీనిపై ప్రజల బాధ తీర్చాలని 9న చలో అమరావతి నిర్వహిస్తుంటే జిల్లాలో ముందుస్తు అరెస్టులు చేయడం దారుణమని సిపిఐ నేత తాటిపాక మధు అన్నారు. ఈ నెల 9న సిపిఐ చలో అమరావతికి పిలుపునిస్తే ఒకరోజు ముందు నుండే పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సిపిఐ, ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయడం … Read more

Kudupudi Sattibabu: టీడీపీ బిసి సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కుడుపూడి సత్తిబాబు

తెలుగుదేశం పార్టీ బిసి సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజమండ్రికి చెందిన కుడుపూడి సత్తిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ బిసి సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ … Read more