AP TET ఏపి టెట్ 2024 ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వహించిన AP TET ఫలితాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అవి ఏ క్షణమైనా aptet.apcfss.in లో రిలీజ్ అవ్వవచ్చు. నిజానికి ఇప్పటికే ఏపి టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయ్యినట్లు అధికారులు చెపుతున్నారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు షిఫ్టులుగా రోజూ జరిగిన పరీక్షల ప్రాధమిక కీ మార్చి 10 న విడుదల కాగా తుది ఆన్సర్ కీ మార్చి 13 న రిలీజయింది. డీఎస్సీ పరీక్షలకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో ఆ ఫలితాల కోసం వేలాది అభ్యర్ధులు నిరీక్షిస్తున్నారు.
ఏపి టెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే?
- అధికారిక వెబ్సైట్ aptet.apcfss.in ను సందర్శించాలి
- టెట్ results అని ఉన్నచోట క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి
- మార్కుల తో పాటు ఫలితం డౌన్లోడ్ అవుతుంది.