“జవహర్ కు కొవ్వూరు టికెట్ ఇవ్వాలి” – బుంగ సంజయ్

మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ కు కొవ్వూరు నియో జకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పునరాలోచించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పార్టీ పార్లమెంట్ బాధ్యు డిగా తెదేపా అభివృద్ధికి జవహర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన గెలుపు కోసం మాదిగలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ కూటమి టికెట్ జవహర్కు కేటాయించాలని కోరారు.

Rate this post