రామచంద్రపురంలో పనికిరాని మంత్రి రాజమండ్రికి ఎలా పనికి వస్తాడు అని గోరంట్ల చెల్లుబవయిన వేణుగోపాలకృష్ణ ని ఉద్దేశించి అన్నారు. ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయం అని టిడిపి ఎప్పుడో చెప్పింది అని, ఎప్పుడో చేసిన నిర్ణయాలు ఇప్పుడు కుదరదు అని చెప్పడానికి జనసేన నాయకుడు ఎవరు అని కందుల దుర్గేష్ ని ఉద్దేశించి అన్నారు. తాను ఈ ఎన్నికలలో పోటీ చేయడం ఖాయం అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తెలుగుదేశం ఒక బలమైన కేడర్ ఉన్న పార్టీ అని, అయితే అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా జనసేనతో కలిసి పని చేయడానికి సిద్దం అని ఆయన అన్నారు.