రాజమండ్రి జే. ఎన్ రోడ్డులోని ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కళాశాల అర్ధ శతాబ్ది ఉత్సవం ఈనెల 22న జరుగుతుందని కళాశాల పాలకవర్గం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరవుతారన్నారు. కళాశాల అభివృద్ధికి కృషిచేసిన విశ్రాంత అధ్యాపకులు, పూర్వపాలకవర్గ సభ్యులకు సత్కారం, అవధాన కార్యక్రమం ఉంటుందన్నారు.