రాజమహేంద్రవరంలోని స్థానిక లాలా చెరువు సమీపంలోని గోదావరి పుష్కర వనంలో ఈ నెల 13వ తేదీన రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్టు శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు నోడగల సుధ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వన సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరువుతారని తెలిపారు. ఈ సందర్భంగా పలు శ్రీ కృష్ణుడి వేషధారణ పోటీలు, సాంస్కృతి కార్యక్రమాలు, ఆట పాటలు తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేయనున్నట్టు వివరించారు. అలాగే 2022వ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన 10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు నగదు బహుమతి అందచేసి సత్కరించనున్నట్టు తెలిపారు. యాదవ సంఫీుయులంతా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు 9348628787, 9848459904, 9393977111 నెంబర్లను సంప్రదించాలన్నారు.