దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యను తీవ్రంగా ఖండించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ అయిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యను తీవ్రంగా ఖండించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈరోజు హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను గొల్లలమామిడాడ గ్రామంలో పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత బాబు పై కేసు నమోదు చేయడానికి DGP గారికి సూచనలు ఇవ్వడం జరిగిందని నిందితుల నుండి హాని లేకుండా కుటుంబ సభ్యులకు కూడా తగిన రక్షణ కల్పిస్తామని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున సహాయం వచ్చే విధముగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు

Rate this post