తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ)గా ఎన్. తేజ్ భరత్ నియమితులయ్యారు. వెలగపూడిలోని సాధారణ పరిపాలన శాఖలో ముఖ్య కార్యదర్శి దగ్గర ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న ఈయనను జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇక్కడ జేసీగా పనిచేసిన సి. హెచ్. శ్రీధర్ మంగళగిరిలోని ప్రధాన భూపరిపాలన కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి (విజిలెన్స్)గా బదిలీపై వెళ్తున్నారు.