ఈనెల 13వ తేదీ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ఏయూ దూర విద్య ద్వారా డిగ్రీ విద్యార్థులకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరుగుతాయన్నారు. దూర విద్య ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులు గమనించాలని అధ్యయన కేంద్రం నిర్వహకులు ప్రకాష్ తెలిపారు.