డీఆర్వో సుబ్బారావుకు ఐఏఎస్‌ కన్ఫర్మ్‌: కలెక్టర్‌ మాధవీలత అభినందనలు

జిల్లా రెవెన్యూ అధికారి బి.సుబ్బారావుకు ఐఏఎస్‌ సర్వీసు కన్ఫర్ప్‌ అయింది. దీంతో కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ కె.మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో  సుబ్బారావును సత్కరించి అభినందించారు. అనంతరం  కలెక్టర్‌ మాట్లాడుతూ పరిపాలనా దక్షతకు నిదర్శనంగా, నిబద్ధతకు మారుపేరుగా సుబ్బారావు నిలుస్తారన్నారు. సుదీర్ఘమైన ప్రభుత్వ సర్వీసులో ఎన్నో హోదాల్లో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి నిబద్ధతగల అధికారిగా గుర్తింపు పొందారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇక్కడకు డీఆర్‌వోగా వచ్చి అందరి మన్ననలు పొందారన్నారు. ఆయన పనితీరును గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ కేడర్‌కు పదోన్నతి కల్పించడం సంతోషదాయకమన్నారు. 

Rate this post