మహాకాళేశ్వరాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పూజలు

రాజమండ్రి గౌతమఘాట్ రోడ్డులోని ఇన్నీస్ పేట రోటరీ కైలాస భూమి చెంతన ఉన్న మహాకాళేశ్వరాలయంలో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వామివారిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీస్సులు అందించారు. మంత్రి వెంట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఉన్నారు.

Rate this post