తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు సిబ్బంది సమస్యలను సమగ్రంగా పరిష్కరించే నిమిత్తం ‘పోలీస్ వెల్ఫేర్ డే’ ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన సిబ్బంది అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.