తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అభద్రత, సమస్యాత్మక, నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ‘డ్రోన్ కెమెరా’ను ఉపయోగించి శాంతి భద్రతల పరిరక్షణకు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.