Kudupudi Sattibabu: టీడీపీ బిసి సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కుడుపూడి సత్తిబాబు

తెలుగుదేశం పార్టీ బిసి సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజమండ్రికి చెందిన కుడుపూడి సత్తిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ బిసి సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంలకు కృతజ్ఞతలు తెలిపారు.

3.7/5 – (4 votes)