‘ఆంధ్ర కేసరి యువజన సమితి’ వ్యవస్ధాపకుడు ఇక లేరు

రాజమహేంద్రవరంలో ‘ఆంధ్ర కేసరి యువజన సమితి’ వ్యవస్ధాపకుడు, కార్యనిర్వాహకుడు వై. ఎస్. నరసింహా రావు మంగళవరం ఉదయం 6:45 నిమిషాలకు చనిపోయారు. సమితి‌ ఆధ్వర్యంలో ఈ నగరంలో ఎకెసి జూనయర్, డిగ్రీ కాలేజిలను నెలకొల్పారు. కోటిపల్లి బస్ స్టాండ్ వద్ద, మహిళా స్వాతంత్ర‌యోధుల విగ్రహాలతో పార్క్ ను ఏర్పాటు చేశారు. అందులోనే ప్రీడం భవన్ అనే సమవేశ మందిరాన్ని‌ నిర్మించారు.

పెద్దాపురంలో 1936 లో జన్మించిన నరశింహారావు ఉద్యోగిగా, అధికారిగా‌ సహకార శాఖలో సేవలు అందించారు. సాంఘిక సేవ, చరిత్ర సంస్కృతుల పై అభిరుచులతో ఉద్యోగ విరమణ అనంతరం‌ ఆ రంగంలో పూర్తి కాలవు సేవల ప్రారంభించారు. ఆంధ్ర కేసరి యువజన సమితిని ప్రారంభించారు. 2016 వరకూ కార్యక్రమాల్లో చురుగ్గా వుండేవారు.

సోషల్ లీడర్ షిప్‌ అనేది‌ అంతరించిపోయి చాలా కాలమైంది.‌ 86 ఏళ్ళ నరశింహారావు గారి మరణంతో సేవ, సాంస్కృతిక, కార్యక్రమాల్లో, ప్రజోపయోగ సంస్ధల నిర్వహణలో రాజకీయాలకు అతీతంగా నాయకులను, ప్రజలను కూడగట్టగలిగిన ఒక సాంఘిక నాయకుడిని రాజమహేంద్రవరం శాశ్వతంగా కోల్పోయింది.

Rate this post