రాజమండ్రిలో “స్పందన” నిర్వహించిన జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు సామాన్య ప్రజల సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారుల అర్జీలను సంబంధిత జోనల్ డిఎస్పీల సమక్షంలో స్వీకరించి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత డిఎస్పిలతో చర్చించి, పిర్యాదు యొక్క సమస్యలను చట్ట ప్రకారం విచారణ జరిపించి, నిర్దేశిత గడువులోగా పరిష్కారించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఇంచార్జ్ ఈస్ట్ జోన్ కె. టి. వి. రవికుమార్, యస్. డి. పి. ఓ కొవ్వూరు బి. త్రినాథ్, సెంట్రల్ జోన్ డిఎస్పి జె. వి. సంతోష్, సౌత్ జోన్ డిఎస్పి ఎం. శ్రీలత, నార్త్ జోన్ డిఎస్పి కె. వెంకటేశ్వర రావు స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Rate this post