జక్కంపూడి రాజా చేతులమీదుగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం

మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ నందు ఆల్ హూద సోషల్ సర్వీసెస్ ఫౌండర్ మరియు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఖాజీ మౌలానా షేక్ కరీముల్లా జామి ఆధ్వర్యంలో పేద ముస్లింలకు బాసటగా జక్కంపూడి రాజా చేతులమీదుగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వ ఖాజిగా సమర్థవంతమైన విధులు నిర్వహిస్తూ మరోపక్క ఆల్ హూద సోషల్ సర్వీసెస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూన్న కరీముల్లా బాయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారాన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాహను ప్రార్థిస్తారాన్నారు. కుల మతాలకు అతీతంగా రంజాన్ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందనన్నారు. ఈ కార్యక్రమంలో అల్ సమి డైరెక్టర్ అబ్దుల్లా గారు, షఫీ ఫ్రూట్ మర్చంట్, మహమ్మద్ ఆయుబ్, సయ్యద్ సలీం, సయ్యద్ ఆదిల్ భాయ్, ముక్కర్రం భాయ్, అక్బర్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.

Rate this post