వైకాపాలో పలువురి చేరికలు

రాజమహేంద్రి: మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో నగర వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు సీతా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆది వారం పలువురు పార్టీలో చేరగా వారికి అర్బన్ నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి భరత్లామ్ వైకాసా కండువాలు కప్పి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు తనపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల ఫలితమేమీ ఉండదన్నారు. అభివృద్ధి పనుల్లో తాను కమీషన్లు తీసుకున్నట్లు రుజువు చేస్తే దేని కైనా సిద్ధమన్నారు. కమీషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుం బానిదేనని, అదే దృష్టితో తనపై బురదజల్లుతున్నారన్నారు.

Rate this post