రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఆధునీకరణకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని రాజమండ్రి ఎంపీ మార్గానిభరత్ తెలిపారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. టెర్మినల్ బిల్డింగ్‌కి రూ. 346 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలో ఎయిర్‌బస్ వచ్చే విధంగా టెర్మినల్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. దీంతో ఎయిర్ పోర్టులో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు.