రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 9, 10, 11వ తేదీలలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రాజమండ్రి సిటీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అత్తిలి రాజు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్దగల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగర ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.