విశాఖ పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి వచ్చిన ప్రధాని మోదీని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఎన్ఎస్ డేగా వద్ద ప్రధానిని కలిశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ విమానాశ్రయంలో కలిసి స్వాగతం పలికారు. సీఎం జగన్ కు ఎంపీ భరత్ పుష్పగుచ్చం అందజేశారు. ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విశాఖ చేరుకున్నారు. అయితే అంతకు రెండు గంటల ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి విశాఖకు వచ్చారు. ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జగన్ కొద్ది సేపు విమానాశ్రయంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఎంపీ భరత్ సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తరువాత ప్రధాని మోదీ రాగానే సీఎం జగన్ తో పాటు ఎంపీ భరత్ కూడా ఎదురెళ్ళి మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని విశ్రాంతి తీసుకోనున్న ఐఎన్ఎస్ డేగా వద్ద మరోసారి సీఎం జగన్ తో పాటు ఎంపీ భరత్ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. అటు తర్వాత మన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ని కూడా ఎంపీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు.