నగరంలోని గోకవరం బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు, వజ్రాభరణాల షోరూంను హోం మంత్రి తానేటి వనిత శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ భరత్ రాం, రుడా చైర్మన్ షర్మిలా రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ ఎండీ విష్ణు చరణ్ భట్ వీరికి సాదర స్వాగతం పలికారు. అనతరం బంగారు, వెండి, ప్లాటినం విభాగాలను వారు తిలకించారు.
మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఆభరణాలు అందుబాటులో ఉనడం అభినందనీయం అని అన్నారు. ఎండీ మాట్లాడుతూ తమ షోరూం లో అత్యంత నాణ్యత కలిగిన ఆభరణాలు అందుబాటు ధరల్లో ఉన్నాయని చెప్పారు.