పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. బుధవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరంపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని అసలు విషయం ఏమిటో తేల్చడం లేదన్నారు.