ఈనెల 12వ తేదీన రాజమండ్రి లాలాచెరువు నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు 5 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శనను నిర్వహించనున్నట్లు వైసీపీ నేత బొంతు శ్రీహరి తెలిపారు. జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్, గొందేసి పూర్ణ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు.