CPI : నేటి నుంచి నగరంలో సీపీఐ జిల్లా మహాసభలు

సీపీఐ తూర్పుగోదావరి జిల్లా మహా సభలు రెండు రోజులపాటు జరుగుతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. సోమవారం ప్రజా ప్రదర్శన, అనంతరం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు. మంగళవారం సోమాలమ్మ గుడి సెంటర్ రౌతు తాతలు కళ్యాణ మండపం వద్ద ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు.


భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా మహా సభలు ఆగస్టు 1, 2 తేదీలలో జరుగుతున్న దృష్ట్యా ఎర్ర జెండాల తోరణాలతో నగరమంతా ముస్తాబయింది ఆగస్టు 1న సోమవారం రాజమండ్రిలో ప్రదర్శన జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం నగరమంతా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సిపిఐ కార్యాలయం నుండి ప్రజా ప్రదర్శన ప్రారంభమవుతుందని వన్ టౌన్ మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ చేరుతుందని అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు
Rate this post