పట్టపగలుకు రాష్ట్ర ప్రభుత్వ గిడుగు పురస్కారం

రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు, రోటరీ అధ్యక్షుడు పట్టపగలు వెంకట్రావుకు రాష్ట్ర ప్రభుత్వ గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 29న విశాఖపట్నంలో నిర్వహించే గిడుగు రామమూర్తి పంతులు జయంతి ఉత్సవాలలో తెలుగు భాషాభ్యున్నతి కోసం కృషిచేస్తున్న పలువుర్ని ప్రభుత్వ అవార్డులతో శత్కరించనుంది. ఈ మేరకు పట్టపగలు వెంకట్రావుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15వేలు నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసి సన్మానించనుంది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నుంచి తమకు ఆహ్వానం అందిందని పట్టపగలు వెంకట్రావు తెలిపారు.

Rate this post