రౌడీషిటర్లకు, బ్లేడ్-బ్యాచ్ వ్యక్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహణ

రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలోని పోలీసు స్టేషన్ ఎస్. హెచ్. ఓ లు రౌడీషిటర్లకు, బ్లేడ్-బ్యాచ్ వ్యక్తులకు ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారు రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికి చేరుకోవాలని అనవసరంగా రోడ్లపైన తిరగవద్దని సూచించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీవ్రంగా ఉంటాయని, రౌడీషిటర్లకు, బ్లేడ్-బ్యాచ్ వ్యక్తుల కదలికలపై మరియు వారి వ్యక్తిగత అలవాట్లపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు.

Rate this post