రాజమండ్రిలో జరిగే “గోదావరి గర్జన” సందర్భంగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాకు రాజమండ్రీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శాలువాతో స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయానికి విచ్చేసిన నాయకులు, కార్య కర్తలకు అభివాదం చేస్తూ సభా స్థలికి కారులో బయలుదేరి వెళ్లారు.