Blood Donation Camp: ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

ప్రపంచ తలసేమియా దినోత్సవమును పురస్కరించుకొని ఆదివారం మగ్నా మదర్ & ఛైల్డ్ హాస్పిటల్ మరియు జైన్ సేవ సమితి వారి ఆధ్వర్యంలో రాజమండ్రిలోని రివర్ బే ఫంక్షన్ హాల్ నందు మెగా రక్తదాన శిబిరంను నిర్వహించారు.

ముందుగా ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా స్థానిక గోదావరీ గట్టు నుండి రివర్ బే వరుకు ర్యాలీ నిర్వహించారు, ఈ రక్తదాన శిబిరంలో సుమారు 350 దాతలు పాల్గొని రక్త దానం చేశారు.

ఈ కార్యక్రమంలో 150 మంది తలసేమియా వ్యాధి గ్రస్తులు వివిధ జిల్లాల నుండి పాల్గొన్నారు వారికి మగ్నా మదర్ & ఛైల్డ్ హాస్పిటల్ డాక్టర్స్ డా” కె. దుర్గ ప్రసాద్ (పీడియాట్రీషన్) మరియు డా” చందన పర్వత వర్థిని (గైనకాలజిస్ట్) మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న తలసేమియా బాధితులు సంఖ్య పెరుగుతుందని, తలసేమియా వ్యాధిగ్రస్తులకు 15 రోజులకోసారి రక్తం ఎక్కిస్తేనే వారి ప్రాణం నిలుస్తుంది, ఈ తలసేమియా వ్యాధి శరీరంలో రక్తహీనత, క్షీణతకు, ఎర్రరక్తకణాల లోపానికి కారణమయ్యే వ్యాధి, దీని ద్వారానే ఆక్సిజన్‌ (ప్రాణవాయువు) శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా అందజేయడం జరుగుతుంది. తలసేమి వ్యాధి సోకిన వారిలో ఈ హిమోగ్లోబిన్‌ ఉండే ఎర్రరక్తకణాలు తగ్గిపోయి. వ్యాధిసోకిన దశ నుంచి తీవ్రమయ్యే వరకు ఎర్ర రక్తకణాలు పూర్తిగా క్షీణించడం, హిమోగ్లోబిన్‌ కణాల ఆకారం కూడా మారిపోతుంది. ప్రాణవాయువు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. శరీరాలలోని రక్తకణాల నిర్మాణాలను బట్టి వాటి లోపాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఏర్పడవచ్చని ప్రారంభ దశలో ఈ వ్యాధిని గుర్తించక/చికిత్స తీసుకోకపోతే జీవిత కాలం ఐదుసంవత్సరాల వరకే పరిమితమయ్యే అవకాశం ఉందని తలసేమియా వ్యాధి పై అవశ్యకతను తలసేమియ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించి, రక్తమార్పిడి చేయించుకుంటూ ఐరన్‌ చేలేషన్‌ చేస్తే వారి యొక్క జీవప్రమాణం మెరుగుపడుతుంది, ఇలాంటి వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా కావాల్సింది రక్తమే. ఆ రక్తమే ప్రస్తుతం వారికి దొరకడం కష్టంగా మారిందని తెలిపి తలసేమియా బాధితులు పడుతున్న ఇబ్బందులు ను గుర్తించి నేడు ఈ రక్తదాన శిబిరం ను ఏర్పాటు చేశామని తెలిపారు.

Rate this post