“సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర” విజయవంతం

రాజమహేంద్రవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కార్యక్రమంలో మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులు డా. బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కోమరం భీం వంటి ఎందరో మహానుబావులు బీసీల అభివృద్ధికి పోరాడారని అదే మార్గంలో ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనకబడిన తరగతుల అభివృద్ధి విశేషంగా కృషి చేస్తున్నారని సామాజిక న్యాయ బేరి బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరంలో సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కార్యక్రమాంలో బీసీ ఎస్సి ఎస్టి, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన 17 మంది మంత్రులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. బీసీ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేద వర్గాల ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలను అందించామన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, సున్నవడ్డీ, జలకళ, సామాజిక పెన్షన్స్, ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో నాడు. నేడు, రైతు, మత్స్యకారుల భరోసా, చేయూత వంటి అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. బిసి లు అంటే బ్యాక్ బొన్ అని నమ్మిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర వచ్చిన తరువాత అనేక ప్రభుత్వాలు చూసామని ఏనాడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన రెడ్డి అని ఆయన తెలియజేశారు. జగన్ పరిపాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 17 మందికి మంత్రి పదవులను కేటాయించడమే అందుకు నిదర్శనమన్నారు. సామాజిక, ఆర్థిక, న్యాయాలను పాలనపరంగా సాధ్యం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిఅన్నారు. ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయల పంపిణీ లో 80 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అభివృద్ధికి ప్రభుత్వం అందించిందన్నారు. బీసీ ఎస్సీ మైనార్టీల సంక్షేమం కోసం జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియ చేయాలని ఉద్దేశంతోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

Rate this post