కాకినాడ, తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు

సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా): తిరుపతి ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు జూలై 1 నుంచి 30 వరకు 18 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే కమర్షియల్‌ అధికారులు శనివారం చెప్పారు. సెకండ్‌, థర్డ్‌ ఎసీ, స్లీపర్‌ కోచ్‌లతో 12 భోగీలతో నడువనున్న ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కాకినాడ-తిరుపతిల మధ్య జూలై 1, 6, 8, 13, 15, 20, 22, 27, 29లలో రాత్రి 6.45 నిమిషాలకు కాకినాడలో బయలుదేరి సామర్లకోట, రాజమండ్రి, విజయవాడల మీదుగా తిరుపతికి మరుసటి రోజు ఉదయం 6.30కి చేరుతుంది. తిరుగుప్రయాణంలో 07209 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలుగా తిరుపతి నుంచి జూలై 2, 7, 9, 14, 16, 21, 23, 28, 30 లలో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ రైల్వేస్టేషన్‌కు చేరుతుందన్నారు. ఇందుకు సంబంధించి రిజర్వేషన్‌ ప్రక్రియ సంబంధిత రైల్వేస్టేషన్లలో సంప్రదించాలన్నారు.
Rate this post